కోహ్లి ముంగిట మరో రికార్డు

another record awaits Virat kohli  - Sakshi

న్యూఢిల్లీ:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఎన్నో వ్యక్తిగత రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. భారత్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్ లు గెలిచిన రెండో కెప్టెన్ గా నిలిచేందుకు మూడు టెస్టుల దూరంలో ఉన్నాడు. కోహ్లి నేతృత్వంలో భారత జట్టు 29 టెస్టు మ్యాచ్ లు ఆడగా, 19 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇంకా మూడు గెలిస్తే సౌరవ్ గంగూలీ రికార్డును కోహ్లి అధిగమిస్తాడు. శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేస్తే గంగూలీ రికార్డును కోహ్లి బద్ధలు కొడతాడు. గంగూలీ నాయకత్వంలో భారత జట్టు 49 టెస్టులకు 21 విజయాలు సాధించింది.

కాగా, భారత తరపున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్ ఎంఎస్ ధోని. ధోని సారథ్యంలో 60 టెస్టు మ్యాచ్ లు ఆడిన భారత జట్టు 27 గెలిచింది. ఇదిలా ఉంచితే, కోహ్లి నేతృత్వంలో భారత జట్టు వరుసగా 8 టెస్టు సిరీస్ లను గెలిచి ఊపుమీద ఉంది. దాంతో ప్రస్తుత లంకేయులతో టెస్టు సిరీస్ భారత్ కు కష్టం కాకపోవచ్చు. ఈనెల 16వ తేదీన ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో భారత్ జట్టు తొలి టెస్టు ఆడనుంది. 24 వ తేదీన నాగ్ పూర్ లోని విదర్బ స్టేడియంలో రెండో టెస్టు జరగనుండగా, డిసెంబర్ 2 వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మూడో టెస్టు ఆరంభమవుతుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top