అనూజ్, కమల్‌ ముందంజ 

Anooj And Kamal Lead In Ultimate 10 ball Championship - Sakshi

అల్టిమేట్‌ 10 బాల్‌ ఇండియా ఓపెన్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ క్యూ స్పోర్ట్స్‌ సంఘం (టీసీఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘బాలీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అల్టిమేట్‌ 10 బాల్‌ ఇండియా ఓపెన్‌’ టోర్నమెంట్‌లో అనూజ్‌ ఉప్పల్, కమల్‌ ముందంజ వేశారు. పంజగుట్టలోని హైదరాబాద్‌ నెక్ట్స్‌ గెలారియా మాల్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ రెండో రౌండ్‌లో వీరిద్దరూ విజయాలు సాధించారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్‌లో అనూజ్‌ ఉప్పల్‌ 8–7తో శివమ్‌ అరోరాపై గెలుపొందగా... కమల్‌ చావ్లా 8–3తో అర్పిత్‌ సేత్‌ను ఓడించాడు.

ఇతర మ్యాచ్‌ల్లో రఫత్‌ హబీబ్‌ 8–6తో హెట్‌ పటేల్‌పై, అభిషేక్‌ అహుజా 8–1తో అరవింద్‌ కుమార్‌పై, ఫైజల్‌ ఖాన్‌ 8–4తో చేతన్‌పై, దిలీప్‌ కుమార్‌ 8–2తో లక్ష్మణ్‌పై, మోను చౌదరి 8–5తో దివ్య శర్మపై, సుమిత్‌ తల్వార్‌ 8–2తో రణ్‌వీర్‌ సింగ్‌ మార్వాపై, వరుణ్‌ కుమార్‌ 8–1తో నితీశ్‌ మదన్‌పై, పాండురంగయ్య 8–5తో భరత్‌పై, షాబాజ్‌ ఆదిల్‌ ఖాన్‌ 8–3తో సాద్‌ సల్మాన్‌పై, మొహమ్మద్‌ హుస్సేన్‌ ఖాన్‌ 8–2తో నవ్‌నీత్‌సింగ్‌పై, పుష్పీందర్‌ సింగ్‌ 8–3తో మొహమ్మద్‌ షోయబ్‌ ఖాన్‌పై, హిమాన్షు జైన్‌ 8–3తో శ్రీనుపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top