ఆధిక్యం దిశగా ఆంధ్ర

Andhra in the lead - Sakshi

ఒడిశా 294/6

సాక్షి, విజయనగరం: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆంధ్ర రంజీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించే అవకాశముంది. ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆటముగిసే సమయానికి ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 294 పరుగులు చేసింది. గోవింద్‌ పొద్దార్‌ (111; 13 ఫోర్లు) సెంచరీ చేయగా... సేనాపతి (91; 11 ఫోర్లు, ఒక సిక్స్‌) శతకాన్ని చేజార్చుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో భార్గవ్‌ భట్‌ మూడు, శశికాంత్‌ రెండు వికెట్లు తీశారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 584కు ఒడిశా జట్టు మరో 290 పరుగుల దూరంలో ఉంది. ఈలోపే చివరి రోజు ఒడిశాను ఆలౌట్‌ చేస్తే ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభిస్తుంది.

స్నేక్‌ క్రికెటర్‌..
మూడో రోజు ఆటలో మైదానంలో నాగుపాము కలకలం సృష్టించింది. రెండు జట్ల సభ్యులు ఆటలో నిమగ్నమై ఉండగా మైదానంలోకి పాము వచ్చింది. ఆంధ్ర జట్టులోని నెల్లూరుకు చెందిన అశ్విన్‌ హెబ్బార్‌ పరుగు పరుగున వచ్చి పామును చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. మైదానం బయట పచ్చిక బయళ్లలోకి విసిరేశాడు. దీంతో అంతా అశ్విన్‌ను అభినందించారు. ‘స్నేక్‌ క్రికెటర్‌’ అంటూ సరదాగా బిరుదు కూడా ఇచ్చేశారు. ఇతను గతంలోనూ మైదానంలోకి వచ్చిన ఐదు పాముల్ని ఇలాగే పట్టుకుని బయట వదిలిపెట్టాడని తెలిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top