ఆనాటి టీ20 మ్యాచ్‌ గుర్తుందా?

In 2016 Team India Lose by a Run Against West Indies  - Sakshi

లాడర్‌హిల్‌ (అమెరికా): లాడర్‌హిల్స్‌ మైదానం అంటే పరుగుల పండుగే. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇక్కడ భారత్‌–వెస్టిండీస్‌ మధ్య జరిగిన టి20నే దీనికి ఉదాహరణ. నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 245 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లలో ఎవిన్‌ లూయీస్‌ (49 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగి శతకం బాదగా, జాన్సన్‌ చార్లెస్‌ (33 బంతుల్లో 79; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు.

రోహిత్‌ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులతో భారత్‌ దీటుగానే బదులిచ్చింది. అయితే, రహానే (7), కోహ్లి (16) వైఫల్యంతో ఆశలు నీరుగారాయి. కానీ, కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 100 నాటౌట్‌; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో నిలిపాడు. అప్పటి కెప్టెన్‌ ధోని (25 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్‌) సైతం బ్యాట్‌ ఝళిపించినా... చివరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన పరిస్థితిలో అతడు ఔటయ్యాడు. కడదాక పోరాడిన భారత్‌ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.  (ఇక్కడ చదవండి: ఆట మళ్లీ మొదలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top