మాజీ ప్రియుడి పెళ్లి ఆపేందుకు విశ్వప్రయత్నం!

Woman Stops Ex Wedding In Bridal Gown In China - Sakshi

తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియుడిని మర్చిపోలేని ఓ యువతి.. వేరొకరితో అతడి పెళ్లి జరగటాన్ని సహించలేకపోయింది. మాజీ ప్రియుడి పెళ్లిని ఆపేందుకు పెళ్లికూతురిలా ముస్తాబై ఏకంగా వివాహ వద్దకు చేరుకుంది. మరికొన్ని నిమిషాల్లో అతడితో పెళ్లి ప్రమాణాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న యువతిని కాదని తనను పెళ్లి చేసుకోవాలని బతిమిలాడింది. మోకాళ్లపై కూర్చుని మరీ ‘తప్పు నాదే. పెళ్లి చేసుకో’ అంటూ అతడి చేయిపట్టుకుని ప్రాధేయపడింది. ఊహించని ఈ ఘటనతో షాకైన అసలు పెళ్లికూతురు ముఖం మాడ్చుకుని వేదిక నుంచి దిగిపోగా.. మాజీ ప్రియురాలిని విదిలించుకుని వరుడు కూడా ఆమెను అనుసరించాడు. కాబోయే భార్యను అనునయిస్తూ తన వెంట తీసుకువెళ్లాడు.

చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చేస్తోంది. ఈ క్రమంలో.. ‘నిజమైన ప్రేమంటే ఇదేనేమో. ఆమెను అర్థం చేసుకోవచ్చుగా’ అని కొందరు కామెంట్‌ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. ‘చేసిన తప్పునకు ఫలితం అనుభవించక తప్పదు. ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో వాళ్లకు మాత్రమే తెలుసు’ అంటూ అభిప్రాయపడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top