టిక్‌టాక్‌ వీడియో కోసం.. జారిపడిపోయింది!

Woman Fell Down While Filming TikTok Video - Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న యాప్‌ ఏదైనా ఉందా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది టిక్‌టాక్‌ యాపే. సినిమా డైలాగులు, పాటలు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉన్న ఈ యాప్‌ పట్ల... యువతతో పాటు చిన్నారులు, పెద్దలు కూడా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ యువతి కూడా తన ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. ఇందుకోసం డీకే బోస్‌ సినిమాలోని పడిపోయా పడిపోయా అనే పాటను ఎంచుకుంది.

ఈ క్రమంలో పడిపోయా అంటూ పాటకు అనుగుణంగా భావోద్వేగాలు పలికించబోయింది. కెమెరాపై మాత్రమే దృష్టి సారించడంతో మెట్లపై నుంచి నిజంగానే ఢమాలున జారిపడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. పడిపోయా పడిపోయా అంటూ నిజంగానే పడిపోయావా తల్లి.. ఎందుకమ్మా నీకు ఈ కష్టాలు అంటూ పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సుప్రీంకోర్టు టిక్‌టాక్‌ యాప్‌పై మాద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
టిక్‌టాక్‌ వీడియో చేస్తూ..

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top