కుక్కను కొట్టాడు.. కర్మ ఫలం అనుభవించాడు

Viral video Man Hits Dogs Karma Bites Back In Pakistan - Sakshi

ఎంతటివారైనా కర్మ ఫలం అనుభవించక తప్పదు అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. ఒకరికి హాని కలిగించాలని భావించి తనే చిక్కుల్లో పడ్డాడు. హాస్యాస్పదంగా, ఆలోచనాత్మకంగా ఉన్న ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్‌ వాడకం బాగా పెరిగిపోయాక సోషల్‌ మీడియాలో సరదా, సందేశాత్మక వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కాస్త ఫన్నీగా ఉన్నా సరే ఆ వీడియోలను తెగ షేర్‌ చేస్తున్నారు. తాజాగా గురువారం రెండు వీడియోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేశాయి. ఒక వీడియోలో ఓ వ్యక్తి ప్రతిభ ప్రతిబింబిస్తే.. మరో వీడియోను చూస్తే కర్మ సిద్దాంతం గుర్తు రాక మానదు. 

ఫిట్‌ భారత్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఓ వ్యక్తి ప్రతిభను చూసి నెటిజన్లు ఔరా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. కాగా మరో వీడియోలో కుక్కను కొట్ట బోయి మరో వ్యక్తి ఇబ్బందుల్లో పడిన వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లో జరిగింది. తమ పనికి ఇబ్బంది కలిగిస్తున్న కుక్కలను కొట్టబోయి ట్రాక్టర్‌ రోటివేటర్‌లో చిక్కుకుని పల్టీలు కొట్టాడు. అయితే నెటిజన్లు  ఈ రెండు వీడియోలను పోలుస్తూ.. ఓ వీడియలో వ్యక్తి స్వయం ప్రతిభను కనబరిస్తే.. మరో వీడియోలో యాంత్రిక ప్రతిభ చూశామని కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా కర్మ ఫలం అనుభవించాడని మరికొందరు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top