వైరల్‌: మూడు పాముల సయ్యాట!

Three Snake Dancing Viral In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : రెండు పాములు చుట్టుకుని నాట్యమాడటం తరచూ చూస్తుంటాం. కానీ మూడు పాములు నాట్యమాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తమిళనాడులోని రామనాధపురం జిల్లా పరమకుడి సమీపంలోని అరసడివండల్ అనే గ్రామంలో మూడు పాములు నాట్యమాడాయి. ఆదివారం గ్రామ శివారులో మూడు పాములు కలిసి మెలికలు తిరుగుతూ రెండు మూడు అడుగులు ఎత్తుకు లేచి నాట్యమాడటాన్ని కొందరు గ్రామస్థులు గమనించారు.  వెంటనే ఈ పాముల సయ్యాటను తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. రెండు పాముల విన్యాసాలు సాదరణమే అయినా మూడు పాములు నాట్యం చేయటంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలై వార్తల్లో నిలిచింది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top