ఈ దొంగ సూపరో సూపర్‌.!

Thief Steals Laptop And Writes Apologetic Email To Owner - Sakshi

ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లి క్షమాపణ చెప్పిన దొంగ

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లే దొంగలందు మంచి దొంగలు వేరయా అని చెప్పక తప్పదేమో ఈ సంఘటన చూస్తుంటే... ఓ విద్యార్థి ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లిన దొంగ.. డబ్బులు అవసరమై ఈ పని చేసానని, క్షమించాలని, మీ వ్యాలెట్‌, మొబైల్‌ అక్కడే వదిలేసానని, తన బాధను అర్థం  చేసుకుంటారని భావిస్తున్నానని క్షమాపణలు కోరుతూ సదరు విద్యార్థికి మెయిల్‌ చేశాడు. అంతేకాకుండా యూనివర్సిటీకి సంబంధించిన ఎమైనా అసైన్‌మెంట్స్‌ను ల్యాప్‌టాప్‌లోఉంటే చెప్పాలని, అవి పంపిస్తానని ఆఫర్‌ కూడా ఇచ్చాడు.  ఈ మెయిల్‌ను ఆ విద్యార్థి స్నేహితుడొకరు ట్వీట్‌ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదేం దొంగతనంరా.. నాయనా అని నెటిజన్లు విస్తుపోతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం స్పష్టత లేదు. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top