'పిడి గాంధీ'ని పరిచయం చేసిన రాహుల్‌

Rahul Introduces Pidi Gandhi, Twitter Rocks

న్యూఢిల్లీ : ఆదివారం సమయం మధ్యాహ్నం 12.30 గంటలు. రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ట్వీట్‌కు జతగా చేసిన వీడియోలో 'పిడి గాంధీ' (పెంపుడు కుక్క)ని పరిచయం చేశారు రాహుల్‌. 'రాహుల్‌ మీ గురించి ట్వీట్లు ఎవరు చేస్తారు? అని కొందరు నన్ను అడిగారు. వారికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను అది తనే(పిడి). నా కంటే పిడి స్మార్ట్‌ అందుకే ట్వీట్లు వేగంగా చేస్తుంటుంది. పిడి ఎంత స్మార్టో ఈ వీడియో చూడండి' అంటూ రాహుల్‌ ట్విట్‌ చేశారు.

వీడియోలో రాహుల్‌ ఆజ్ఞలను శిరసావహించిన శునకం.. చక్కని ట్రిక్‌ను ప్రదర్శించింది. రాహుల్‌ చేసిన ట్వీట్‌కు దాదాపు 20 వేల లైక్‌లు రాగా, 8 వేల రీట్వీట్లు వచ్చాయి. కొందరు పిడి గురించి ఆనందం వ్యక్తం చేయగా.. మరికొందరు రాహుల్‌ను క్రిటిసైజ్‌ చేశారు.

ఆసక్తికర రీట్వీట్‌ :
రాహుల్‌ను క్రిటిసైజ్‌ చేస్తూ రీట్వీట్‌ చేసిన ప్రముఖుల్లో అసోం బీజేపీ నాయకుడు హిమంతా బిస్వా శర్మ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా ఉంది. ' పిడి గాంధీ గురించి నాకంటే ఎవరికి బాగా తెలుసు. అసోం రాష్ట్ర పరిస్థితి గురించి మీతో చర్చించడానికి వస్తే (అప్పట్లో బిస్వా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు) పిడికి బిస్కెట్లు తినిపిస్తూ మమ్మల్ని కన్నెత్తైనా చూశారా?' అంటూ రాసుకొచ్చారు. ఆ ఘటన తర్వాత బిస్వా బీజేపీలోకి మారారు. ఆ తర్వాత అసోంలో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించింది. హిమంత్‌ బిస్వా ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top