వైరలవుతోన్న అనంత్‌ అంబానీ-రాధికా ఫోటో

Picture Of Anant Ambani And Radhika Merchant Is Going Viral - Sakshi

అనంత్ అంబానీ, అతని గర్ల్ ఫ్రెండ్ రాధిక మర్చంట్ మధ్య ఏదో నడుస్తోందని వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఊతమిచ్చేట్లు.. వీరిద్దరు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అందులో అనంత్‌తో పాటు రాధిక మర్చంట్ పసుపు లెహెంగా ధరించి అతిథులతో కనిపిస్తొంది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్, సీఈఓ వీరెన్ మర్చంట్ ముద్దుల తనయ అయిన రాధిక మర్చంట్‌.. అనంత్ అంబానీ బాల్య స్నేహితురాలు.

గత సంవత్సరం అనంత్ - రాధిక కలిసి  దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటికొచ్చింది. ఆ తరువాత నుంచి రాధిక మర్చంట్‌, అనంత్‌తో  కలిసి అంబానీ కుటుంబంలోని ప్రతి వేడుకకు హాజరవుతున్నారు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ అయిన రాధికా.. ఇటీవలే రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కూడా కనిపించింది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా ఎంగేజ్‌మెంట్ పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రాధిక గురించి అనంత్‌ను ఆటపట్టించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top