దీపావళి రోజైనా ఈ బ్రా యాడ్స్‌ చేయకు!

Netizens Troll On Disha Patani  - Sakshi

ముంబై : కనీసం ఈ దీపావళి రోజైనా బ్రా యాడ్స్‌ పోస్ట్‌ చేయవద్దని బాలీవుడ్‌ నటి దిశా పటానికి సూచిస్తున్నారు నెటిజన్లు. దీపావళి విషెస్‌ తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ చేసిన  పోస్ట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయింది. సంప్రదాయంగా చేతిలో దీపం పట్టుకోని కాల్విన్ క్లైన్ ఇండియా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ బ్రా కనిపించేలా ఉన్న ఫొటోను ఈ అమ్మడు షేర్‌ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. ‘ఏందీ ఈ నాన్సెన్స్‌.. కనీసం పండుగ రోజైన ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు’ అని ఒకరంటే.. దీపావళికైనా ఈ దుస్తుల యాడ్స్‌ ఆపేయని మరోకరు కామెంట్‌ చేశారు.

ఇలా 7 వేల కామెంట్స్‌తో చిరాకుపడ్డ దిశాపటాని సింపుల్‌గా ఆ కామెంట్స్‌ తొలగించింది. ఈ ఫొటోకు 15 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక దిశా పటానిపై ట్రోల్‌ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో బికినీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అప్పట్లో ఈ అమ్మాయికి వేసుకోవడానికి దుస్తులు లేనట్టున్నాయనే కామెంట్స్‌తో నెటిజన్లు ఏకీపరేశారు.


🎆🎆🎆🎆🎆

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top