టాయిలెట్‌ వాటర్‌తో ఇడ్లీ చట్నీ!

Mumbai Idli Vendor Uses Toilet Water to Cook Food - Sakshi

ముంబై : ఓ ఇడ్లీ బండి వ్యక్తి టాయిలెట్‌ వాటర్‌తో చట్నీ తయారు చేసిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన వీధి బండ్ల ఆహార నాణ్యతపై చర్చకు దారితీసింది. ముంబైలోని బొరివెలి రైల్వేస్టేషన్‌ సమీప వీధిలో ఇడ్లీలు అమ్ముకునే సదరు వ్యక్తి.. ఆ రైల్వేస్టేషన్‌ టాయిలెట్‌లో తెచ్చిన వాటర్‌తో చట్నీని తయారు చేశాడు. ఇదంతా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 45 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం ప్రస్తావించలేదు.

ఇక ఈ వీడియోపై ఆహార భద్రతా(ఎఫ్‌డీఏ) అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రజలంతా కలుషిత నీటితో తయారు చేసే ఆహారపదార్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘ఆ వీడియో మా దృష్టికి రావడం జరిగింది. ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. కలుషిత నీటిని ఉపయోగించే అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ నీరు ఆరోగ్యానికి మంచివి కావు. సదరు వ్యక్తిని పట్టుకుని అతని లైసెన్స్‌ను తనిఖీ చేస్తాం, ఎలాంటి సాంపిల్‌ దొరికినా సీజ్‌ చేస్తాం’అని ముంబై ఎఫ్‌డీఏ అధికారి శైలేష్‌ అదావ్‌ మీడియాకు తెలిపారు

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top