వైరల్‌: అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి!

Models Photoshoot At Pig Island Goes Very Wrong - Sakshi

ఈ వీడియో చూసిన తర్వాత ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట’  అని పాడకుండ ఉండలేరు. అవును.. ఓ ఫిట్‌నెస్‌ మోడల్‌ సోషల్‌ మీడియా పిచ్చిలో చేయబోయిన ఓపని బోల్తాకొట్టింది. పందులతో ఫోజివ్వబోయి.. ఇబ్బందులపాలైంది.. వెనిజులాకు చెందిన 32 ఏళ్ల మిచెల్ లెవిన్ అనే ఫిట్‌నెస్‌ మోడల్‌.. బహమాస్‌లోని ఫేమస్‌ పిగ్‌ ఐస్‌లాండ్‌ను సందర్శించింది. అక్కడి పందులతో ఆడుతూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ కోసం అందమైన ఐస్‌లాండ్‌లో బికినీలో మంచి ఫోజులివ్వాలని భావించింది. కానీ ఆ పందులు ఆమెపై దాడి చేసి కొరికేసాయి. దీంతో కేకలు వేస్తూ పరుగెత్తిన ఆమె.. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు ఆ పందిదేం తప్పులేదు.. అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  

🐷🤨🤷🏼‍♀️😂

A post shared by Michelle Lewin (@michelle_lewin) on

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top