వైరల్‌: కదిలే రైలు ఎక్కబోయి..

A Man Survives After He Fells Between Moving Train And Platform - Sakshi

భువనేశ్వర్‌ : భూమిపై నూకలుంటే పిడుగు నెత్తిమీద పడ్డా బతికి బట్టకట్టవచ్చని ఓ ఒడిశా వాసి విషయంలో నిరూపితమైంది. కదిలే రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడిన సదరు వ్యక్తి.. మృత్యువు నోట్లో తలపెట్టి మరి సురక్షితంగా బయటపడ్డాడు. ఒడిశాలోని జొహర్సగుడా రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. రైల్వే స్టేషన్‌లో టీ అమ్మే రాజేశ్‌ తల్వార్‌ కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డాడు. ఫ్లాట్‌ఫామ్‌కు రైలు మధ్య ఉన్న సందులో ఇరుక్కున్న అతను బతకడం కష్టమేనని అక్కడున్నవారందరూ అనుకున్నారు. కానీ రాజేశ్‌ సురక్షితంగా బయటపడి తనపని తాను చేసుకోవడంతో అంతా నోరెళ్లబెట్టారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top