టాంగ్‌.. ఐఫోన్‌.. ఓ మందుపార్టీ

hand in Toilet hole - Sakshi

చైనాలోని గౌంక్సీలో ఓ వ్యక్తి తన ఐఫోన్‌ కోసం చేసిన పని హాట్‌ టాఫిక్‌గా మారింది. టాంగ్‌ అనే యువకుడు గత వారం స్థానిక ఓ హోటల్‌లో స్నేహితులతో కలసి మందు పార్టీ చేసుకున్నాడు. పార్టీ అయిపోయే సమయానికి తూగుతూ తూగుతూ బాత్‌రూం వెళ్లిన టాంగ్‌కి తన ఫోన్‌ గుర్తుకొచ్చింది. వెంటనే లేచి చూసుకుంటుండగా ఫోన్‌ కాస్త పక్కనే ఉన్న టాయిలెట్‌ రంధ్రంలో పడిపోయింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన టాంగ్‌.. ఫోన్‌ కోసం ఆ రంధ్రంలో చేయి పెట్టి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అరచేతి నుంచి మోచేయి.. అటు నుంచి భుజం వరకు రంధ్రంలో పెట్టి వెతికాడు. ఎంత ప్రయత్నించినా ఫోన్‌ చేతికందలేదు సరికదా.. రంధ్రంలో ఇరుక్కున్న చేయి కాస్త గీసుకోపోయి గాయాలయ్యాయి.

20 నిమిషాల పాటు తీవ్రంగా ప్రయత్నించిన అతడు.. ఫోన్‌ పోతే పోయింది.. చేయి బయటికి వస్తే చాలనే స్థితికొచ్చాడు. సాయం కోసం అరిచాడు. ఈ విషయం గమనించిన ఓ వ్యక్తి.. టాంగ్‌ చేయి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అతడివల్లా కాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. వారు బాత్‌రూం బద్దలు కొట్టి చేతిని బయటకు తీశారు. ఫోన్‌ మాత్రం దొరకలేదండోయ్‌. ఈ విషయమై విచారం వ్యక్తం చేసిన హోటల్‌ యాజమాన్యం..  పోగొట్టుకున్న ఫోన్‌ ధర (రూ.83,625) చెల్లించేందుకు అంగీకరించింది. ఈ డబ్బుతో టాంగ్‌ ఏ ఫోన్‌ కొంటాడో చూడాలి మరి.  

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top