క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌ : పేలుతున్న జోకులు

DataChorCBN And CashForTweet Tags Trending In Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటా కుంభకోణం వ్యవహారంపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారాలోకేశ్‌ కలవరపాటుకు గురయ్యారు. తమ తప్పును కప్పి పుచ్చుకోవడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు, లోకేశ్‌ చేసిన మరో ప్రయత్నంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డబ్బులిచ్చి మరీ చంద్రబాబు, లోకేష్‌లు తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయిస్తున్నారనే విషయం స్పష్టమైందని, దానికి ఆధారాలు ఇవిగో.. అని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో #DataChorCBN, #CashForTweet యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ అయ్యాయి. (చదవండి : అసత్య ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌!)

ఈ ట్యాగ్‌లతో టీడీపీ, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారని కామెంట్‌ చేస్తున్నారు.  ఇతర రాష్ట్రాల వ్యక్తులకు డబ్బులిచ్చి మరి తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తండ్రికొడుకులపై కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ‘ఓటుకు నోటు కేసుతొ కేసీఆర్‌ బాబుని కరకట్టకు పంపెసాడు. #CashForTweet కేసుతో లోకేష్‌ని కేటీఆర్‌ ఎక్కడికి పంపుతారొ చూడాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.‘తమ్ముళ్లూ 18 స్టేలూ తెచ్చుకున్న చరిత్ర నాది.. ఈ డేటా చోర్‌ కేస్‌ నాకొక లెక్కా.. మీరే చెప్పండి?,  డేటా దొంగల్‌’ అనే ఫన్నీ మీమ్స్‌తో #CashForTweet ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. (చదవండి : చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో.. క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top