పోలీసులను పరుగెత్తించిన పాము

Cop Squeals In Horror After Face-Off With Snake

ఫ్లోరిడా : పోలీసు అధికారులను ఓ పాము పరుగులు పెట్టించింది. గజగజ వణికిపోయేలా చేసింది. ధైర్యంగా పామును బంధించి పట్టుకెళతారని పిలిపిస్తే దానికి భయపడి అరుస్తూ గెంతులు పెడుతుంటే వారిని చూస్తున్న అక్కడి వారంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలోని ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడాలోని ఓ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో పాము ఉండటాన్ని గుర్తించారు. దీంతో వారు పోలీసులకు చెప్పారు.

శర వేగంగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పాము చేస్తున్న విన్యాసాలకు వణికిపోయారు. తమ చేతికి ఏ వస్తువు దొరికితే దానిని తీసుకొని తమకు రక్షణగా ఉపయోగించుకుంటూ లబోదిబోమంటూ కేకలు వేశారు. బందిస్తారనుకుంటే చివరకు ఆ పామును ఒక పశువును తరిమినట్లు తరిమేసి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. అక్కడ వారంతా పోలీసుల తైతక్కలను చూసి నవ్వుతుంటే ఆ పోలీసులు మాత్రం వారి వైపు కాస్త చిన్నబోయినవారి మాదిరిగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top