నేనూ మనిషినేగా..అందుకే!

China Robber Returns Money To Woman In ATM - Sakshi

చైనాలో వింత సంఘటన చోటు చేసుకుంది. కొట్టేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసి మానవత్వం చాటుకున్నాడు ఓ దొంగ. తనకు కూడా దయ, జాలి ఉంటాయని నిరూపించి నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే... దక్షిణ చైనాలోని హుయాన్‌ సిటీకి చెందిన ఓ యువతి ఏటీఎంకు వెళ్లింది. డబ్బులు డ్రా చేసిన వెంటనే ఆమె వెనుకగా వచ్చిన ఓ దుండగుడు కత్తితో బెదిరించి... ఆమె దగ్గర ఉన్న 2500 యువాన్లు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా అకౌంట్‌లో బ్యాలెన్స్‌ చెక్‌ చేయమంటూ ఆమెకు సూచించాడు. అయితే సదరు యువతి అకౌంట్‌ జీరో బ్యాలెన్స్‌ చూపించడంతో మనసు మార్చుకున్న దొంగ.. తాను తీసుకున్న సొమ్మును ఆమెకు తిరిగి ఇచ్చాడు. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాగా ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డైంది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..‘ నా బ్యాంక్‌ అకౌంట్‌ చూస్తే అతడు చలించిపోతాడు. అంతేకాదు తన దగ్గర ఉన్న కత్తి, జాకెట్‌ ఇంకా డబ్బు కూడా ఇచ్చేసి బోరుమని ఏడుస్తాడు’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ వీడు చాలా మంచి దొంగ. తాను కూడా మనిషినని నిరూపించుకున్నాడు’ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top