వైరల్‌ వీడియో: వృద్ధురాలిని ముద్దు పెట్టుకున్న దొంగ

Brazil Robber Refuses Cash From Elderly Woman Kisses Her - Sakshi

బ్రెసిలియా: దొంగతనానికి వచ్చిన వారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకడారు. ఇప్పటి వరకు ఎక్కువగా ఇలాంటి దొంగతనాల గురించే విని ఉన్నాం. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే.. ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అనిపించక మానదు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. ఓ ముసలావిడ వద్ద నుంచి డబ్బు తీసుకోకుండా.. ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా.. ముద్దుపెట్టుకుని పంపిన సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

ఈ సంఘటన ఈశాన్య బ్రెజిల్‌లోని అమరాంటేలోని చోటు చేసుకుంది. వివరాలు.. ఇద్దరు వ్యక్తులు గుర్తు పట్టకుండా ఉండటం కోసం హెల్మెట్‌ ధరించి.. చేతిలో గన్‌తో అమరాంటేలోని ఓ ఫార్మసి దుకాణంలో ప్రవేశించారు. షాపు యజమానితో పాటు.. అక్కడ ఉన్న కస్టమర్లను కూడా గన్‌తో బెదిరించి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దొంగల దగ్గర గన్‌ ఉండటంతో యజమానితో సహా అక్కడ ఉన్న వారంతా తమ దగ్గర ఉన్న డబ్బులు తీసి దొంగలకు ఇచ్చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వృద్ధురాలు తన దగ్గర ఉన్న డబ్బు తీసి పక్కనే ఉన్న దొంగకు ఇవ్వబోయింది. కానీ ఆ దొంగ ‘మీరు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు మేడమ్‌’ అంటూ వృద్ధురాలు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

డబ్బులు తీసుకున్న తర్వాత దొంగలు అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డవ్వడంతో.. సదరు షాప్‌ ఓనర్‌ ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. నెటిజన్లు దొంగ చర్యలపై పలు రకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top