జంగాలపల్లి నుంచి ప్రజాసంకల్పయాత్ర

Ys Jagan mohan reddy 88th day prajasankalpayatra begin - Sakshi

సాక్షి, నెల్లూరు : 88వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఉదయగిరి నియోజకవర్గం జంగాలపల్లి నుంచి గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ఆదిమూర్తిపురం, తూర్పు యర్రబల్లి క్రాస్‌, తూర్పుపాళెం క్రాస్‌లలో ప్రజలతో ఆయన మమేకం అవుతారు. కొండాపురంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రేనమాలలో మహిళలతో ముఖాముఖి అవుతారు. ఇప్పటివరకూ వైఎస్‌ జగన్‌ 1,181.7 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. మరోవైపు ప్రజాసంకల్పయత్ర నేపథ్యంలో కొండాపురం మండలం  గొట్టిగుండాల గ్రామానికి చెందిన 120 మంది టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top