ఉపాధి డబ్బులు ఇవ్వడం లేదు
నెల్లూరు(సెంట్రల్): ‘అయ్యా.. వరుణుడు ఏటికేడు ముఖం చాటేస్తూ రైతులను కరువు కోరల్లోకి నెడుతున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులను పక్కకు పెట్టి మేం ఉపాధి పనులకు వెళుతున్నాం. కష్టపడి పనిచేస్తున్నాం. అయితే, చేసిన పనులకు సక్రమంగా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు’ అంటూ వీరారెడ్డిపాళెంనకు చెందిన కోటారెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయాడు. డబ్బులు అందక రోజురోజుకూ కుటుంబ జీవనం దుర్భరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కరించాలని అధికారులకు అర్జీలు ఇచ్చినా లాభం లేదని వాపోయాడు.