వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలి

నెల్లూరు: తమకు నెలకు కనీస వేతనం రూ.18వేలు ఇప్పించాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(వీఆర్‌ఏ) జిల్లా నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  బుధవారం ఏఎస్‌పేట మండలం హసనాపురం వద్ద వీఆర్‌ఏల సంఘం నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ పార్ట్‌టైం పేరుతో ఫుల్‌టైం పనిచేయిస్తున్నారనీ, వేతనం రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలు చాలక తమ కుటుంబాలు దుర్భరజీవనం సాగిçస్తున్నట్లు తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఏటా అర్హులైన వారికి వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించారనీ దీంతో ఎక్కువ మందికి న్యాయం జరిగిందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్కరికి కూడా వీఆర్‌ఓగా పదోన్నతి కల్పించలేదన్నారు.  జననేత వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పెంచలనరసయ్య, అధ్యక్షుడు హజరత్తయ్య ఉన్నారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top