సన్నీ పోస్టర్లను ఇలా కూడా వాడుతున్నారు!

Does Sunny Leone ward off the evil eye? - Sakshi

సాక్షి, నెల్లూరు: మాజీ శృంగార తార, బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ఆంధ్రప్రదేశ్‌ రైతుల పంటలను కాపాడుతోంది. సన్నీకి, ఏపీకి లింకేంటి? పొలాల్లో సన్నీ ఫొటోలు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనుకుంటున్నారా?

శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా బండకిందపల్లెలో పంటల మధ్యలో సన్నీ బికినీ ఫొటోలు దర్శమిచ్చాయి. అలాగని ఒక్కడ ఆమె వీరాభిమానులు ఉన్నారనుకుంటే పొరబడినట్టే. చెంచురెడ్డి అనే రైతు తన పదెకరాల పొలంలో సన్నీ హాట్‌ ఫొటోల పోస్టర్లు పెట్టారు. అంతేకాదు నన్ను చూసి ఏడవకురా అని పోస్టర్ల మీద ముద్రించారు. తన పంటకు నర దిష్టి తగలకుండా చేసేందుకే ఆయన సన్నీ చిత్రాలు పెట్టాడట. తన పొలంలో విరగపండిన కాలిఫ్లవర్‌, క్యాబేజీ, బెండ, మిర్చి పంటపై దిష్టి ప్రభావం పడకుండా ఈ ఏర్పాటు చేసినట్టు చెంచురెడ్డి వెల్లడించారు.

పంటలకు దిష్టిబొమ్మలు పెట్టడం అనేది పూర్వకాలం నుంచి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్ల ఫొటోలను దిష్టిబొమ్మలుగా పెట్టడం ఎక్కువైంది. పంట పొలాలతో పాటు రొయ్యలు, చేపల చెరువుల దగ్గర హీరోయిన్ల ఫొటోలను దిష్టిబొమ్మలుగా తగిలిస్తున్నారు. ఇవన్నీ చూసినవారు మాత్రం పుర్రెకో బుద్ధి అంటే ఇదేనేమో అంటూ ముక్కన వేలేసుకుంటున్నారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top