చంద్రబాబంటే వంచన, వెన్నుపోటు

Ysrcp MPs fires on chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీల ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెబితే ప్రజలకు గుర్తొచ్చేది వంచన, వెన్నుపోటు అనే రెండు పదాలేనని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలపై నాలుగేళ్లు రాజీపడి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్న చంద్రబాబు వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్‌తో బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్‌ ఆవరణలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. 

ఉభయ సభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన
పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా అనంతరం ఉభయ సభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదాపడింది. ప్రత్యేక హోదాపై చర్చించేందుకు వీలుగా సభాకార్యక్రమాలు వాయిదా వేయాలంటూ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు  తక్షణం అమలుకు వీలుగా ఆర్థిక బిల్లుకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవరణలు ప్రతిపాదించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top