టీడీపీ నాయకుల వాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే

YSRCP MLA Kolagatla Denied TDP Leaders Comments In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను ఖాళీ చేయించి ఇతరులకు కేటాయించడంలాంటి అన్యాయమైన చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే కోలగట్ల ఖండించారు. జిల్లా కేంద్రాస్పత్రి ఎదురుగా ఉన్న వైఎస్సార్‌ సీపీ జోనల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కోలగట్ల మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. లంకా పట్టణంలో పట్టాలు ఉన్న వారిని పక్కన పెట్టి, తెలుగుదేశం పార్టీ నేతలు లంచాలు తిని ఇతరులకు ఇళ్లస్థలాలు కేటాయించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. 2009లో తాను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి 485 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇస్తే, ఆ పట్టాలను పక్కనపెట్టి  ఇతరులకు గృహాలు కేటాయించినది టీడీపీ నేతలు కాదా అంటూ ప్రశ్నించారు.

మేము ఇచ్చిన వారు పేదవారు కాదా? మీరు ఇచ్చిన వారు అర్హులా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే కోలగట్ల సవాల్‌ విసిరారు. మా పరిపాలన ఎలా ఉందన్నది ఐదేళ్ల తరువాత ప్రజలు నిర్ణయిస్తారన్నారు. విజయనగరంలో  రోడ్లు వెడల్పు పేరిట చేసిన పనులను దేశం నేతలు అస్తవ్యస్తం చేసి ఒక్క రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top