టీడీపీ నేతలపై మండిపడ్డ రొంగలి జగన్నాధం

YSRCP Leader Rongali Jagannadham Fires On TDP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ : మున్సిపల్‌ మాజీ మంత్రి నారాయణ, ఐటీ మాజీ మంత్రి నారా లోకేష్‌ రూ. 772 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం ఆరోపించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ కేంద్రంగా టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీయాలని జగన్నాధం డిమాండ్‌ చేశారు.

ఉత్తరాంధ్ర మున్సిపాలిటిల్లో నిధులు పక్కదారి పట్టాయని జగన్నాధం ఆరోపించారు. ఎన్నికలకు ముందు రూ. 200 కోట్లు విడుదల చేసి కమిషన్లు కాజేశారని పేర్కొన్నారు. ఈ అవినీతిలో మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్యే వెలగపూడిలకు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీఎం జగన్‌ని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top