మంత్రి దేవినేనికి ఓటమి తప్పదు

YSRCP Leader Parda Saradi Slams Devineni Uma - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పార్థసారథి

గొల్లపూడి(విజయవాడరూరల్‌): రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సొంత పార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో దేవినేనికి ఓటమి తప్పదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. గొల్లపూడిలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గ్రామానికి చెందిన చెన్ను కిరణ్‌ ఆధ్వర్యంలో 50 మంది పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారధి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్థసారథి మాట్లాడుతూ మంత్రి మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాయలసీమకు నీరు ఇచ్చింది నేనే, తాను లేకపోతే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగేది కాదంటూ గొప్పలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని పిచ్చి పనులు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న మంత్రి పాపాలు భయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రతి వారం పోలవరం వెళ్లే మంత్రి ఇసుక సొమ్మును సంచుల్లో  దోచుకుని రావడానికి వెళ్తున్నారని ఆరోపించారు. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ విజయం తధ్యమన్నారు. 

తక్కువ సమయంలోనే మంచి పట్టు సాధించిన కృష్ణ ప్రసాద్‌ తన సత్తాచాటుకుంటున్నారని, దీంతో మంత్రి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్సార్‌ సీపీ అన్నారు. హోదా సాధనకు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు చేసినప్పుడు చంద్రబాబు మోదీతో స్నేహం చేశారన్నారు. 600 హామీలు ఇచ్చిన టీడీపీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఈ విషయంలో  గొల్లపూడిలో  బహిరంగ చర్చకు సిద్ధమేనాని టిడిపి నాయకులకు పార్ధసార ధి సవాల్‌ విసిరారు.  ఏ వర్గం ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనకు చంద్రబాబు పాలనకు పొంతన లేదన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు మైలవరంలో వసంతను గెలిపించి, ముఖ్యమంత్రిగా జగన్‌మోహనరెడ్డిని చేయాలని పిలుపునిచ్చారు. వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ మంత్రి దేవినేని మైలవరంలో ప్రజాస్వామాన్ని  ఖూనీ చేస్తున్నారని అన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు మొదలుపెట్టాడని విమర్శించారు. మంత్రి ఉమాకు దమ్ము ధైర్యం ఉంటే తనపై నేరుగా పోరాటానికి రావాలని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, పార్టీ నాయకులు అడపా శేషు, విజయవాడ రూరల్‌ మండల పోలింగ్‌ బూత్‌ మేనేజర్‌ కాటంనేని పూర్ణచంద్రరావు, కేడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు రాంబాబు, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజ బ్రహ్మయ్య, బొమ్మసాని రమేష్, ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌ కేతుపల్లి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.రవికుమార్, మహిళా విభాగం నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత
గోసాల(పెనమలూరు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సముచిత న్యాయం జరుగుతుందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి అన్నారు. గోసాల గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఆదివారం చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన  ప్రసంగించారు. మహానేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆశయాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందన్నారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఇంటికి పంపాలి
వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక పాలన సాగించిన టీడీపీని ఇంటికి పంపాలని పార్థసారథి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందలేదని ఆరోపించారు. కేవలం పార్టీలో నాయకులు, కార్యకర్తలే అర్హత లేకుండా పథకాలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు. పార్టీలో పి.అహ్మద్, ఎండి.దాదా, పి.నాగులా, బాజీ, ఎండి.జాబీర్, జాకీరా, షఫీ, సలీం తదితరులు చేరారు. వారికి పార్థసారథి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కిలారు శ్రీనివాసరావు, సంగెపు శ్రీనివాసరావు, పోలవరపు రవి, అప్పారావు, మద్దాలి రామచంద్రరావు, వల్లే నరసింహారావు, గద్దలరాజా, కలతోటì ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top