30న విశాఖలో ‘వంచన వ్యతిరేక దీక్ష’కు సన్నద్ధం కండి

YSRCP calls for party people that strike on 30th of this month - Sakshi

     పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌ సీపీ పిలుపు 

     నల్ల చొక్కా లేదా టీషర్ట్‌ ధరించాలి

     ఉదయం 7కు ముందే దీక్షా స్థలికి చేరుకోవాలి

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మోసపూరిత విధానాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న విశాఖపట్నంలో జరుపనున్న ‘వంచన వ్యతిరేక దీక్ష’కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పిలుపు నిచ్చింది.

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్‌ జారీ అయింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్య నాయకులతో చర్చించి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు విశాఖపట్నంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు (12 గంటలు) జరిగే నిరాహార దీక్షలో నల్ల చొక్కా లేదా నల్ల టీషర్ట్‌ ధరించి పాల్గొనాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

దీక్షలో పాల్గొనబోయే నేతలందరూ ముందు రోజు, ఏప్రిల్‌ 29వ తేదీ సాయంత్రానికల్లా విశాఖపట్నం చేరుకోవాలని, ఉదయం 7 గంటల కంటే ముందుగానే జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని మహిళా కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top