విశాఖలో నేడు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర స్థాయి సమావేశం

YSR Congress Party state level meeting today in Visakhapatnam - Sakshi

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర స్థాయి సమావేశం విశాఖపట్నంలోని విశాఖ ఫంక్షన్‌ హాలులో మంగళవారం ఉదయం పదిగంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. చిన వాల్తేరు ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ ప్రాంతాల్లో పాదయాత్ర అనంతరం జగన్‌ ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. 

ఏర్పాట్ల పరిశీలన 
విశాఖ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ సమావేశ ఏర్పాట్లను సోమవారం పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కడప మేయర్‌ కె.సురేశ్‌బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బద్వేల్‌ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, పార్టీ నాయకులు రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, పాకా సురేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top