వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ

YSR Congress Party MPs Meets in Vijay Sai Reddy House - Sakshi

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ వీరితో ప్రమాణం చేయిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తవుతుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్‌ నికోబార్‌ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. లోక్‌సభ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top