చంద్రబాబు పాలనలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి

YS sharmila press meet at amaravathi - Sakshi

వైఎస్సార్ హయాంలో అందరికీ భరోసా ఉండేది

అయిదు సంతకాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

కనీసం తొలి సంతకాన్ని కూడా చేయలేదు

అమరావతిలో ఒక్క శాశ్వత భవనం అయినా ఉందా?

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు హయంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైఎస్‌ షర్మిల అన్నారు.  సోమవారం అమరావతిలో ఆమె మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. అదే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకునేవారని వైఎస్‌ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... రైతులను మోసం చేశారని విమర్శించారు. మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు...తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. 

ఓ సామాన్యురాలిగా ప్రశ్నిస్తున్నా...
‘నేను వైఎస్సార్‌ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నా.. భూత‌ద్దం పెట్టుకుని వెతికినా రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. మ‌హానేత వైఎస్సాఆర్ హ‌యాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంట‌కు గిట్టుబాటు ధ‌ర ఉండేది. ప్ర‌తి వ్య‌క్తికి ఉపాధి ఉండేది. పేద‌ విద్యార్థి ఉచితంగా గొప్ప చదువులు చదివేలా పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ ఉండేది. కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు ఆఖ‌రికి పార్టీల‌కు కూడా అతీతంగా ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్‌ ప్ర‌తి వ‌ర్గానికి మేలు చేసిన నాయ‌కుడు.’  అన్నారు. 

ఇవి వాస్తవాలు కావా చంద్రబాబు..
బాబు అధికారంలోకి రావ‌డానికి మొత్తం రుణ‌మాఫీ అని వాగ్దానం చేసి అదే మొద‌టి సంత‌కం అవుతుంద‌ని చెప్పి ఎన్నిక‌ల అయిపోయిన త‌ర్వాత రుణ‌మాఫీ ఫైల్‌పై సంత‌కం పెట్ట‌కుండా రుణ‌మాఫీకి క‌మిటీ వేస్తున్నాన‌ని సంత‌కం పెట్టారు. చంద్ర‌బాబు డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మొత్తం రుణం మాఫీ చేస్తామ‌న్నారు. ఆ శాఖ‌కు చెందిన మంత్రి ప‌రిటాల సునీత అసెంబ్లీలో స‌మాధాన‌మిస్తూ మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ చేయ‌లేదన్నారు.  రూ.14వేల కోట్లు ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్నిరూ.60వేల కోట్ల‌కు పెంచారు. నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో బాబుకు కావాల్సిన వాళ్ల‌కు కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేంద్రం నుంచి పోల‌వ‌రాన్ని లాగేసుకున్న‌ది నిజం కాదా?. పోల‌వ‌రాన్ని 3 ఏళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని మీరు చెప్ప‌లేదా చంద్ర‌బాబు?  నేటికి అది పూర్తి కాలేదంటే అది మీ అస‌మ‌ర్థ‌త కాదా?.  ప్రశ్నలు సంధించారు.

ఊసరవెల్లి సిగ్గుపడాలి..
అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపారు. కానీ ఒక్క శాశ్వత భవనం కట్టారా. చంద్రబాబు పేద విద్యార్థుల భవిష్యత్ ఖూనీ చేసింది నిజంకాదా. పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసింది నిజం కాదా. లోకేష్‌కి ఏకంగా మూడు శాఖలు అప్పగించారు, జయంతికి, వర్దంతికి తేడా తెలియనివాడికి మూడు శాఖలా ఎలా అప్పగిస్తారు?. డేటా చోరీ దోషులని ఇప్పటికి పట్టుకోలేదు, సిగ్గుగాలేదా?. బాబు, మోదీ జోడీ రాష్ట్రానికి అన్యాయం చేసింది వాస్తవం కాదా. ప్రత్యేక హోదా నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోరా. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా. ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఎక్కడ చూసినా అవినీతి. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి అని మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు చందమామ ని తెచ్చిస్తా అంటే ప్రజలు నమ్మలా. నిప్పు నిప్పు అంటే తుప్పు నిప్పవుతుందా. అసత్యానికి మారు పేరు చంద్రబాబు. చంద్రబాబు సూటిగా చెప్పండి...జగన్ అన్న ఊరురు తిరిగి హోదా కోసం పోరాడకపోతే నీ నోట హోదా మాట వచ్చేదా, చేతనైతే నిజం చెప్పు. చంద్రబాబు రోజుకొక మాట, పూటకో వేషం, మిమ్మల్ని చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకోవాలి. 

జగనన్న జనంలోనే ఉన్నాడు..
9 ఏళ్ళు జగనన్న విలువల రాజకీయము చేశాడు, చంద్రబాబులా అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వలేదు, పదవుల కంటే విశ్వసనీయత ముఖ్యం అనుకున్నాడు. నాన్నలా అందరికి మేలు చేయాలనుకుంటున్నాడు. చంద్రబాబుకు వెన్నుపోటు, మోసం, అవినీతి, స్వార్ధ రాజకీయాలు, హత్యలు చేయడంలో అనుభవం ఉంది. 5 ఏళ్లలో కొన్ని వందల మందిని పొట్టన బెట్టుకున్నారు, రిషితేశ్వరి, వనజాక్షి విషయంలో చంద్రబాబు ఏం చేశారు. చంద్రబాబు అరాచకవాది కాదా. చంద్రబాబుని మించిన దుష్టుడు ఉండరు అని ఎన్టీఆర్ అన్నారు. ప్రజలు ఆలోచించండి. బాబు పాలనలో రాష్ట్రం ఎక్కడికి పోతుంది. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, ప్రజలకు ముఖ్యం. ఆలోచించి ఓటు వేయండి.

అయిదేళ్లు గాడిదలు కాశారా?
చంద్రబాబు ఈ అయిదేళ్లు ఏళ్ళు గాడిదలు కాశారా?. పవన్ కళ్యాణ్ యాక్టర్, యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ప్రస్తుతం ఆయన అదే చేస్తున్నాడు. చంద్రబబు డైరెక్టర్‌ కాబట్టే ....డైరెక్టర్ చెప్పినట్టు పవన్ చేస్తున్నాడు. పవన్ నామినేషన్‌కి పచ్చ పార్టీ క్యాడర్ ఉంటుంది. పైకి మాత్రం పొత్తులు లేవని చెబుతూ..లోపల కుమ్మక్కు రాజకీయాలు. పవన్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే. జనసేన పార్టీకి ఓటు వేస్తు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లే. మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయం చేస్తున్నారు. కుటుంబ పెద్దను ఎవరైనా చంపుకుంటారా?. మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటున్నారా. మేము బాధితులు, మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా కుటుంబ సభ్యుల హత్యలు జరిగాయి. చంద్రబాబుకు దమ్ముంటే థర్డ్ పార్టీ విచారణకి సిద్ధపడాలి.’ అని వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. ఎన్నికల ప్రచారంలో  అమ్మ విజయమ్మ కూడా ప్రచారం చేస్తారని, తాను  29 నుంచి మంగళగిరి నుంచి ప్రారంభిస్తా అని ఆమె షర్మిల తెలిపారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

09-06-2019
Jun 09, 2019, 05:00 IST
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే...
09-06-2019
Jun 09, 2019, 04:52 IST
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే...
08-06-2019
Jun 08, 2019, 08:12 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు....
08-06-2019
Jun 08, 2019, 04:07 IST
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్‌ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ...
06-06-2019
Jun 06, 2019, 19:56 IST
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది....
06-06-2019
Jun 06, 2019, 19:54 IST
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ...
06-06-2019
Jun 06, 2019, 16:53 IST
చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా...
06-06-2019
Jun 06, 2019, 15:31 IST
ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారని ఉత్తమ్‌ విమర్శించారు.
06-06-2019
Jun 06, 2019, 14:02 IST
మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఘట్‌బంధన్‌ విఫలమై విడిపోవడానికి...
06-06-2019
Jun 06, 2019, 10:41 IST
స్థానిక నాయకుల వల్లే కుప్పంలో తగ్గిన మెజారిటీ
06-06-2019
Jun 06, 2019, 08:25 IST
 చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ముగ్గురు ఎంపీలు పదవుల కోసం రచ్చకెక్కడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ...
05-06-2019
Jun 05, 2019, 17:31 IST
తెలుగు దేశం పార్టీలో లోక్‌సభ పదవుల పందేరం చిచ్చు రేపింది.
05-06-2019
Jun 05, 2019, 15:34 IST
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్‌బై చెప్పిన...
05-06-2019
Jun 05, 2019, 13:14 IST
రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
05-06-2019
Jun 05, 2019, 11:45 IST
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే...
05-06-2019
Jun 05, 2019, 09:03 IST
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ...
05-06-2019
Jun 05, 2019, 08:29 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ...
05-06-2019
Jun 05, 2019, 07:52 IST
న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న...
04-06-2019
Jun 04, 2019, 20:13 IST
సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
04-06-2019
Jun 04, 2019, 04:35 IST
న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top