మహానేతా నిను మరువలేం..

YS Rajasekhara Reddy Death Anniversary Tributes In all over Telugu States - Sakshi

వాడవాడలా దివంగత సీఎం వైఎస్‌కు ఘనంగా నివాళి

అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతల నేతృత్వంలో సేవా కార్యక్రమాలు

పలుచోట్ల అన్నదానం, ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు

వైఎస్‌ మేళ్లను గుర్తుచేసుకుని,అకాల మృతికి చింతించిన ప్రజలు

వైఎస్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న నేతలు

సాక్షి, నెట్‌వర్క్‌: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని, విదేశాల్లోని ఆయన అభిమానులు వైఎస్‌ సేవలు గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జోహార్‌ వైఎస్సార్‌ అంటూ నినాదాలు చేశారు. వివిధ ప్రాంతాల్లో అన్నదాన, ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పాలు, పండ్లు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలతో ప్రజల మనసు చూరగొన్న వ్యక్తిగా మహానేత ఎన్నటికి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా వైఎస్‌ భావించారన్నారు. వైఎస్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నేతలు ప్రతినబూనారు.  
విజయవాడలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్‌కు నివాళులర్పిస్తున్న పార్టీ నాయకులు మేరుగ నాగార్జున, కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు,  గౌతం రెడ్డి తదితరులు 

పేదలకు ఏదైనా చేయాలనే తపన పడేవారు
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని శాసనమండలి విపక్షనేత డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవాలని ఆయన నిరంతరం తపన పడేవారన్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టినవే ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కోటి ఎకరాలను నీరు ఇవ్వాలని కలలు కన్న మహానుభావుడు వైఎస్సార్‌ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, నారమల్లి పద్మజ, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశాఖలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన ం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్త. చిత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ​​​​​​​
​​​​​​​

మహానేతకు ఘన నివాళి 
విజయవాడలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్‌కు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర కార్యాలయంలో వైఎస్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు కొలుసు పార్థసారథి, మేరుగ నాగార్జున,  వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వంగవీటి రాధాకృష్ణ, పైలా సోమినాయుడు,  పి.గౌతంరెడ్డి, బొప్పన భవకుమార్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్‌ సేవలను గుర్తుచేశారు. మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, పామర్రులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి, గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. పెడనలో జోగి రమేష్, నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

జన నీరాజనం..
తమ అభిమాన నేతకు గుంటూరు జిల్లాలో వాడవాడలా జనం నీరాజనాలు పలికారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తమ నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పి.సాయికల్పనారెడ్డి మరణానంతరం రెండు కళ్లనూ దానం చేయాలని నిర్ణయించారు. వైఎస్‌ గౌరవార్థం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.  

విశాఖలో మెగా రక్తదాన శిబిరం..
విశాఖ బీచ్‌ రోడ్డులోని వైఎస్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సహా పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయసాయిరెడ్డి ప్రారంభించారు. మన్యంలోనూ రాజన్నను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో వైఎస్సార్‌ కూడలిలో వైఎస్‌ విగ్రహానికి పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజలు వైఎస్‌కు ఘన నివాళి అర్పించారు. 

క్షీరాభిషేకాలు, అన్నదానాలు..
వైఎస్‌ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. పాణ్యంలో గౌరుచరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఆలూరు, ఆదోని, మంత్రాలయంలలో ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, వై.సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆర్‌కే రోజా,  నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దేశాయ్‌ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్‌ తమ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top