కూలి డబ్బులు రాకుంటే ఉపాధి కూలీలు ఎలా బతకాలి..?

ys jagans 32 day padayatra diary - Sakshi

32వ రోజు
11–12–2017, సోమవారం
చిన్నంపల్లి క్రాస్,   అనంతపురం జిల్లా

కూలి డబ్బులు రాకుంటే ఉపాధి కూలీలు ఎలా బతకాలి..?

ఈ రోజు ఉరవకొండ దాటి రాప్తాడు నియోజకవ ర్గంలో అడుగు పెట్టాను. కూడేరు సమీపంలోని జయపు రానికి చెందిన ఎర్రి సామన్న కలిశాడు. ఏప్రిల్‌ నుంచి ఉపాధి హామీ పథకం కూలి డబ్బులు ఇవ్వలేదన్నా.. అని వేదన పడ్డాడు. పైగా అతను ఆ ఊరిలో మేట్‌ అట. మరో రెండడుగులు వెయ్యగానే తలుపూరువాసి రత్నమ్మ కలి సింది. ఆమెదీ ఇదే సమస్య.. ‘తినడానికే కష్టంగా ఉంటే.. పాపనెలా చదివించుకోవాలన్నా’ అని కంట తడి పెట్టిం ది. దీంతో ఉపాధిహామీ పథకంపై ఆరా తీశా. గత 5–7 నెలలుగా కూలి డబ్బులు ఇవ్వడం లేదట. రోజుకూలితో బతికేవారు నెలల తరబడి కూలిడబ్బులు రాకపోతే ఏం తినాలి? ఎలా బతకాలి? కూలి పని చేసినా డబ్బులు రాక పూట గడవక పోవడంతో ఇక్కడి గ్రామీణులకు కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వలస పోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి.

ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ‘అనంత’ రైతులు, రైతు కూలీల వలసలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశా. 10, 20 ఎకరాలున్న రైతులు కూడా కేరళలో భిక్షాటన చేస్తున్న విషయం చెప్పా. ఉపాధి హామీ పథకం సమర్థంగా అమలు చేసి ఉంటే వారికి ఈ పరిస్థితి రాదు కదా.. అని కూడా నిలదీశా. పక్క రాష్ట్రాలలో కూలి డబ్బులు ఎక్కువ వస్తున్నాయని, అం దుకే వలసలు పోతున్నారని అధికార పక్షం వారు బుకాయించారు. ఈ రోజు పాద యాత్రలో ప్రజలు వచ్చి నెలల తరబడి కూలి డబ్బులుæ ఇవ్వడం లేదని చెబుతుంటే.. అనం త నుంచి ఏటా లక్షల మంది వలస పోవడానికి ప్రభుత్వ మే ప్రత్యక్ష కారణమన్న విషయం నాకు సుస్పష్టమైంది. అసలు అనంతపురంలోని వలసలు, ఆత్మహత్యలు చూసి, వాటిని నివారించేందుకే నాన్నగారు అధికారంలోకి వచ్చి న వెంటనే ఉపాధి హామీ పథకాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభింపజేశారు. ఆ రోజు ఈ పథకం అమలులో ఆం ధ్ర రాష్ట్రం అవార్డులు అందుకుంది. ఈ రోజు అటువంటి పథకం అమలు తీసికట్టుగా మారిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?

అక్కడి నుంచి మరికొద్ది దూరం నడిచిన తర్వాత పొలాల్లోని కూలీలు వచ్చి కలిశారు. వారిలో ఈశ్వరమ్మ అనే చెల్లెమ్మ ‘అన్నా.. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిం చండ’ని అడిగింది. ‘ఏం చదివావు తల్లీ..’ అని అడిగా. ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ అని చెప్పింది. ‘యూనివర్సిటీలో అటెండర్‌ పోస్టులకు కూడా అప్లయ్‌ చేశాను. అధికార పార్టీ నాయకులు వారికి కావాల్సినవారికి కొందరికి, డబ్బులు తీసుకుని మరి కొందరికి ఆ పోస్టులు ఇచ్చేశారు. రెండుసార్లు కానిస్టేబుల్‌ పోస్టులకు కూడా అప్లయ్‌ చేశాను. రాలేదు. ఇక ఉద్యోగం వస్తుందన్న ఆశ ఆవిరైపోయి పొలం పనులకు వెళ్తున్నా’ అంది. నాకు నోట మాట రాలేదు. పీజీ చదివిన ఎస్సీ అక్కా చెల్లెమ్మలు కూడా విధిలేని పరిస్థితుల్లో పొలం పనులు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగభృతి అన్న ఆ పెద్ద మనిషి మాటలు ఏమయ్యాయో?

ఈ రోజు పాదయాత్రలో చివరగా ముస్లిం సోదరు లతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముస్లిం సోదరులు నాన్నగారిని మరీమరీ తలచుకుని మాట్లాడటం నన్ను కదిలించి వేసింది. ప్రజలకు మేలుచేసే నాయకుడిని ప్రజ లు పదికాలాలపాటు తమ గుండెల్లో గూడు కట్టుకుని నిలుపుకొంటారనిపించింది. ఇదే సమ్మేళనంలో ఒక విష యం తెలిసింది. ఓ కుటుంబంలో ఇద్దరు పిల్లలు డెంగీ బారిన పడ్డారట. డెంగీ లాంటి జ్వరాలు ఆరోగ్య శ్రీ కిందకు రాకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లో చికిత్స కోసం పిల్లల్ని బెంగళూరుకు తీసుకెళ్లారట. డెంగీ అని నిర్ధారణ కూడా అక్కడే జరిగిందట. వారు శక్తిమేర ప్రయత్నించినా విధి వారిని చిన్నచూపు చూసింది.. ఇద్దరు పిల్లలూ చనిపోయారు. ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 లక్షల పరిహారం, ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఇది జరిగి ఏడా దిన్నర పైగా గడిచి పోయింది. ప్రభుత్వ సాయం మాత్రం బూటకపు హామీలతోనూ, కంటితుడుపు çపరామర్శ ల తోనూ ముగిసిపోయింది. ఆహా.. సామా న్యుడి వైద్యంపై సర్కారుకు ఎంత ప్రేమో! కనీస రోగనిర్ధారణ పరీక్షలు, సరైన వైద్య సదుపాయాలు జిల్లా కేంద్రంలో కూడా లేకపోవడం ఎంత దారుణం? సామాన్యులకు డెంగీ లాంటి జ్వరాలు వస్తే వారి జీవితాలు గాలిలో దీపాలేనా?

చివరిగా ముఖ్యమంత్రి గారికి నాదొక ప్రశ్న.. వల సల నివారణ కోసం ఉద్దేశించిన ఉపాధి హామీ పథకంలో పేదలతో పని చేయించుకుని కూలి డబ్బులు నెలల తరబడి ఇవ్వకపోవడం శ్రమ దోపిడీ కాదా? దీనికన్నా వలసలే నయమని ప్రజలు భావిస్తున్నారు. లక్షలాది కుటుంబాలు వలస వెళ్లడానికి, బాగా బతికిన రైతులకు కూడా పొరుగు రాష్ట్రాలలో బిచ్చమెత్తుకునే పరిస్థితి రావడానికి కారణం మీరు కాదా?

- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top