విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర

Ys Jagan PrajaSankalpaYatra Enters Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లా(విజయనగరం)లోకి ప్రవేశించింది. విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత సోమవారం విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకోగానే వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో చింతలపాలెం గ్రామం జనసంద్రంతో నిండిపోయింది. చింతలపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించి రాజన్న బిడ్డ ముందుకు కదిలారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top