16వ రోజు పాదయాత్ర డైరీ

 YS Jagan prajasankalpayatra: 16th day diary - Sakshi - Sakshi - Sakshi

23–11–2017, గురువారం

వెల్దుర్తి, కర్నూలు జిల్లా

రాజులా బతికిన రైతుకా ఈ కష్టం!

పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభం అయిన ప్పుడు అశేష జనవాహిని నాతో కలిసి అడుగులు వేసింది. సమస్యల్ని నివేదించింది.   మధ్యాహ్నం పాదయాత్రలో ఉండగా విజయవాడలో రైతులు ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి హతాశుడిని అయ్యాను. నేరుగా వారితో ఫోన్‌లో మాట్లాడాను. మన ప్రభుత్వం వచ్చిన తక్షణం రైతులకు సహాయం అందిస్తుం దని, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపవద్దని వారికి విజ్ఞప్తి చేశాను.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందులు.. ఇలా ప్రతి అవి నీతిలోనూ, ప్రతి అక్రమంలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండటం, వారికి ముఖ్యనేత అండదండలు పుష్కలంగా ఉండటంతో, రైతులలో ఆత్మ విశ్వాసం మరింత సన్నగిల్లుతోంది. ఆత్మ హత్యల వైపు వారిని ప్రేరేపిస్తోంది. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని మార్చాలి. రైతన్నను మారాజులా చూసు కోవాలి.

ఉదయం పాదయాత్ర మొద లవగానే నర్సాపురం క్రాస్‌రోడ్డు సమీపంలో అక్షయ గోల్డ్‌ బాధితు లు వచ్చి కలిశారు. సురేశ్‌బాబు అనే ఏజెంటు కన్నీరుమున్నీరుగా విలపించా డు. యాజమాన్యం ఆస్తులు అమ్మి, బాధితు లకు డబ్బులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గోడు వెళ్లబోసుకున్నాడు. ‘ఒక్క ఏడాది ఓపిక పట్టు సురేశ్‌బాబు.. బాధితులందరికీ తక్షణ న్యాయం అందేలా చేస్తాను’ అని చెప్పాను.

కష్టపడి సంపాదించి, బిడ్డల భవిష్యత్తు కోసం, రాబోయే కుటుంబ అవసరాల కోసం పొదుపు చేసుకున్న సొమ్మును దోచుకుని పరారైపోతే ఈ పొదువు జీవుల బతుకులు ఏమైపోవాలి? వారి చేత డబ్బులు కట్టించిన ఏజెంట్లు.. బాధితుల శాపనార్థాల నుంచి, ధర్మాగ్రహపు దాడుల నుంచి ఎక్కడికి తప్పిం చుకుని పోవాలి? అక్షయ, అగ్రి గోల్డ్‌ బాధి తుల కుటుంబాలు దాదాపు 19 లక్షల పైచిలు కు ఉన్నాయి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం కేవలం రూ.1182 కోట్లతో 13.8 లక్షల కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు. దోషుల్ని పట్టుకుంటాం.. న్యాయం చేస్తాం.. అంటూ కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటోంది.

చివరిగా చంద్రబాబుకు నాదొక ప్రశ్న.. రైతాంగం మీద మీరెందుకింత కక్ష కట్టారు? అన్నదాతలందరూ వైఎస్సార్‌ను అభి మానించడమే అందుకు కారణమా? అక్షయ, అగ్రి గోల్డ్‌ బాధిత కుటుంబా లను ఆదుకోవడానికి మీరు తీసుకున్న చర్యలు బాధితులకు నిజంగా ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారా? ఇప్పటివరకు మీరు తీసుకున్నవన్నీ కంటితుడుపు చర్యలు కాదా? దోషులకు మీ అండదండలు ఉండటం వాస్తవం కాదా?

(వెల్దుర్తిలో వైఎస్‌ జగన్‌కు తన కష్టం చెప్పుకుంటున్న ఓ దివ్యాంగురాలు )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top