16వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

ys jagan mohan reddy PrajaSankalpaYatra finish on 16th day - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, వెల్దుర్తి : నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 16వ రోజు వెల్దుర్తిలో ముగిసింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జననేత జగన్ చేపట్టిన యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. నేటి ఉదయం వైఎస్ జగన్ 16వ రోజు పాదయాత్రను పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించిన వైఎస్ జగన్ గురువారం 13.4 కిలోమీటర్లు నడిచారు. రామల్లెపల్లె నుంచి ఈ పాదయాత్ర కొనసాగింది. అనంతరం వైఎస్‌ జగన్‌ బోయినపల్లి క్రాస్‌ రోడ్డు చేరుకున్నారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌రోడు చేరుకుని అక్కడి స్థానికులతో ముచ్చటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకున్నారు.

భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకున్నారు. వెల్దుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ సంస్థలు గోవిందా. వర్షాలు, రైతులు గోవిందా. ఇళ్ల నిర్మాణాలు గోవిందా. పెన్షన్లన్నీ గోవిందా. ప్రజా సంక్షేమ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలను గోవిందా అనిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని’ వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్‌ జగన్ 16 రోజుల్లో ఓవరాల్‌గా 225.6 కిలోమీటర్లు నడిచారు‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top