చిత్తూరుకు సముద్రం తీసుకొస్తా అనలేదు.. సంతోషం..

YS Jagan Mohan Reddy meeting at Srikalahasti in chittoor - Sakshi

వైఎస్ఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తయినా చంద్రబాబు నీళ్లు ఇవ్వలేదు

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు

పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు రుణాలు ఒక్క రూపాయి మాఫీ కాలేదు

హైదరాబాద్‌ వెళ్తే ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ వర్తించనదని నాలుగేళ్లకు గుర్తొచ్చిందా?

శ్రీకాళహస్తి బహిరంగసభలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్

సాక్షి, శ్రీకాళహస్తి: ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కోట్లకు కోట్ల రూపాయాలు ఇచ్చి కొన్న చంద్రబాబు ఆ నేతలతో రాజీనామా చేయించకుండా ఏకంగా నలుగురికి కేబినెట్‌లో మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగాన్ని అవహేళన చేసిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబని, దేశంలో మరెక్కడా ఇలాంటి నీచ రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదని వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ సక్రమంగా నడవాలని, లాభాల్లో ఉండాలని దుర్మార్గంగా చిత్తూరు డైరీని మూయించారు. ఆయన అధికారంలోకి వచ్చారంటే జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని చెరకు రైతులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారని వైఎస్ జగన్ అన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. చెర్లోపల్లి గ్రామంలో రావి మొక్కను నాటిన వైఎస్ జగన్ ఈ సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలో బహిరంగ సభలో పాల్గొని నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండగట్టారు. చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని గాలేరు-నగరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్. ఆ మహానేత దాదాపు ప్రాజెక్టు పనులు పూర్తిచేయగా, ప్రస్తుత సీఎం చంద్రబాబు చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో వాటికి పైపులు ఏర్పాట్లు చేసి నీళ్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. నల్లధనం సూట్‌కేసుల్లో ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు రాజీనామా చేయరు. వ్యవస్థను మేనేజ్ చేయడంలో మాత్రమే చంద్రబాబు దిట్ట అని విమర్శించారు.

కన్నతల్లికి అన్నం పెట్టని వాడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లు చంద్రబాబు పాలన ఉందన్నారు. చిన్న మోసాలు, హామీలను జనాలు నమ్మరని భావించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి కేజీ బంగారం.. ప్రతి ఇంటికి బెంజ్ కారు అని హామీ ఇస్తారని ఎద్దేవా చేశారు. విదేశీ పర్యటనల్లో భాగంగా ఏ దేశానికి వెళ్లొచ్చినా వెంటనే రాజధాని ఆ దేశాల తరహాలో నిర్మిస్తామని చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇంకా నయం సముద్రం తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలో పెడతానని చెప్పలేనందుకు మనం సంతోషించాలి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు వేల పరిశ్రమలు తీసుకొచ్చారా, లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా కనిపించాయా అని ప్రశ్నించారు. ఓ వైపు వాళ్ల కష్టాలు చెప్పుకుంటూ, మరోవైపు మీ వెనుక మేమున్నాం అన్నా అంటూ నా భుజాన్ని తట్టి ఆశ్వీర్వదీస్తున్న అందరికీ వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు.

        వైఎస్ జగన్ ప్రసంగంలో మరిన్ని అంశాలు..

  • నాలుగేళ్ల పాలన పూర్తవుతోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉందంటూ సీఎం చంద్రబాబే టీడీపీ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేని పరిస్థితి ఉంది. రైతులు, అక్కాచెల్లెమ్మలు, చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఇలా ఎవ్వరి ముఖాల్లో సంతోషం లేదు. అందుకు సీఎం చంద్రబాబు పాలనే కారణం.
     
  • కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పోటీ పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కట్టాలన్న యోచనలో ఉండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో ఇక్కడికి కేవలం 40 కి.మీ దూరంలో మందవరం ప్రాజెక్టుకు మోక్షం లభించింది. కానీ చంద్రబాబు పాలనలో పనులు ఏ మాత్రం జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ఏ ప్రాజెక్టును చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు
     
  • విదేశాల్లో డబ్బులు దాచుకునేందుకు సింగపూర్, జపాన్, చైనా, ఇలా విదేశాలకు వెళ్లి రావడం బాబుకు అలవాటే. నిధులు లేవంటూనే ప్రైవేట్ విమానాల్లో విదేశాలకు వెళ్లారు చంద్రబాబు.
     
  • చిత్తూరు జిల్లాలో వందల గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయి. ఒక్కో దాంట్లో వందల మంది పని చేస్తున్నారు. చంద్రబాబు సీఎం కాగానే అప్పటివరకూ 3.70 పైసలు ఉన్న కరెంట్ ఛార్జీలను ఏకంగా రూ.8లకు పైగా పెంచేశారు. అది చంద్రబాబు ఘనత.
     
  • గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇక్కడి రెండు చక్కెర ఫ్యాక్టరీలు ఎందుకు మూత పడతాయో తెలియడం లేదని జిల్లా వాసులు అంటున్నారు.
     
  • రూ.51 కోట్లతో రెండు ప్రాజెక్టులు చేపట్టి మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి దిగ్విజయంగా కొనసాగించారు వైఎస్ఆర్. దీంతో చెరుకు రైతులకు ఎంతో ధీమా ఉండేది. చంద్రబాబు సీఎం అయితే ఫ్యాక్టరీలు మూతపడటమే కాదు చెరుకు రైతులతో పాటు కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు
     
  • ప్రభుత్వం సహకారం లేకపోవడంతో తక్కువ ధరకు చెరుకు అమ్మకాలను మానేసిన రైతులు బెల్లం తయారు చేస్తున్నారు. అక్కడా చంద్రబాబు వారికి అడ్డుపడుతున్నారు. నల్లబెల్లం అంటూ రైతులను బెదిరించి చెరకు కొంటున్నారు
     
  • తనకు చెందిన హెరిటేజ్ డైరీ సక్రమంగా, లాభాల్లో ఉండాలని దుర్మార్గంగా ఆలోచించిన చంద్రబాబు చిత్తూరు డైరీని మూయించారు
     
  • వైఎస్ఆర్ హయాంలో కరెంట్ బిల్లులు రూ.50, రూ.100 మాత్రమే వచ్చేవి. కానీ టీడీపీ పాలనలో రూ.500, కొందరికి రూ. 1000 బిల్లులు వస్తున్నాయి.
     
  • ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెరిగాయి. పండుగ వచ్చి ఇంటికి వెళ్లాలంటే ఛార్జీల బాదుడుకు ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది
     
  • తమిళనాడు సరిహద్దులో పెట్రోల్ పోయించుకుంటే 6 రూపాయలు తక్కువ, ఇటువైపు కర్ణాటక సరిహద్దులో అయితే రూ.5.70 పైసలు తక్కువగా ఉంది.
     
  • గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, కందిపప్పు, పామాయిల్ ,గోదుమ పిండి, కారం, ఉప్పు, చింతపండు, కిరోసిన్ ఇలా దాదాపు రూ. 180కి ప్యాక్ చేసి సరుకులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంట్లో ఆరుగురు ఉంటే ఇద్దరి బియ్యం కట్ చేస్తున్నారు.
     
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలన్నా తనను సీఎం చేయాలన్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏంటంటే.. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రాలేదు కాదు కదా.. అదే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి.
     
  • పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు రుణాలు మాపీ అని బాబు నమ్మించారు. ఇప్పటికీ ఒక్క రూపాయి మాఫీ కాలేదు
     
  • ప్రతి పేదవాడికి బాబు ఇల్లు కట్టిస్తానన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇళ్లయినా కట్టించారా?. జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారు. ఆయన సీఎం అయ్యాక నిరుద్యోగులు జాబ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫలితం లేదు
     
  • చిన్న మోసాలు, హామీలను జనాలు నమ్మరని భావించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి కేజీ బంగారం.. ప్రతి ఇంటికి బెంజ్ కారు అని హామీ ఇస్తారని ఎద్దేవా చేశారు.
     
  • ఎన్నికలంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. నాలుగేళ్లలో గుర్తురాని పెన్షన్ లబ్ధిపొందని వాళ్లు ఎన్నికలు దగ్గర పడుతుండగా.. అయ్యో అంత మందికి పెన్షన్ రావడం లేదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారంటా ప్రశ్నించారు
     
  • హైదరాబాద్‌కు వెళ్తే ఏపీ ప్రజలకు వర్తించని ఆరోగ్యశ్రీ నాలుగేళ్ల తర్వాత ఎన్నికల నేపథ్యంలో గుర్తు రావడం హాస్యాస్పదంగా ఉంది
     
  • నల్లధనం సూట్‌కేసుల్లో ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయినా చంద్రబాబు రాజీనామా చేయరు. వ్యవస్థను మేనేజ్ చేయడంలో మాత్రమే ఆయన దిట్ట
     
  • పుష్కరాల్లో తనను తాను హీరోగా చూపించుకోవాలన్న తాపత్రయంతో 29 మంది చావుకు సీఎం కారణమవడం ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు.
     
  • ఎర్రచందనం కోసం వచ్చిన తమిళ కూలీలను 21 మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్పించేసి, వాళ్లు స్మగ్లర్లు అంటూ దుష్ప్రచారం చేశారు
     
  • చంద్రబాబు హయాంలో కథ మొదటికొచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వం 30-35 వేలు మాత్రమే ఇస్తోంది. కానీ మిగతా డబ్బు 60-70 వేలు కట్టడం తమ వల్ల కాదని చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యే పరిస్థితులు కనిపంచడం లేదు. పేదవాడి కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకేశారు, ఆయన తనయుడిగా నేను రెండు అడుగులు ముందుకేస్తాను. లక్షలు ఖర్చయినా సరే మీ పిల్లలను నేను చదివిస్తానంటూ హామీ ఇచ్చారు.
     
  • పిల్లల్ని బడికి పంపిస్తే ఆ తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తాం. మెస్, బోర్డ్ ఛార్జీల కింద రూ.20 చెల్లిస్తాం. పేదల పిల్లలు ఉన్నత చదువులుచదవితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి

     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top