216వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కాకినాడ: అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం మండపేట నియోజకవర్గంలోని రాయవరం శివారు నుంచి 216వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మాధవనగర్, రంగరాయ మెడికల్ కాలేజీ మీదుగా జేఎన్టీయూ సెంటర్ వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.
వైఎస్ జగన్ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
సంబంధిత వార్తలు