ప్రజాసంకల్పం @ 2400 km

YS Jagan Compleat 2400 km In Praka Sankalpa Yatra - Sakshi

ఉత్సాహంగా సాగుతున్న పాదయాత్ర

గోడు చెప్పుకుంటున్న ఆపన్నులు

సమస్యలు వినేందుకు

అధిక ప్రాధాన్యమిస్తున్న జగన్‌

భరోసా నింపుతున్న జననేత మాటలు

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: తమ కష్టాలు తీర్చబోయే ఆశల రేడు వచ్చాడని ప్రజలు సంబరపడుతున్నారు. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు వచ్చిన నవ‘రత్నం’ను చూసి కోనసీమ పల్లెలు కదులుతున్నాయి. ఆయన అడుగులో అడుగేస్తున్నాయి.. తమ గోడు వెళ్లబోసుకుంటున్నాయి. రాజన్న బిడ్డ ఇచ్చిన భరోసాతో జయహో జగన్‌ అంటూ నినదిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు కోనసీమ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిరుద్యోగులు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఎన్‌ఎంఆర్‌లు, వివిధ కుల సంఘాల నేతలు తమ సమస్యలు, డిమాండ్లపై వైఎస్‌ జగన్‌కు దారి పొడవునా వినతిపత్రాలు ఇస్తున్నారు. ప్రజలు తమ కుటుంబ సమ్యలు, అనారోగ్య సమస్యలపై ఆయనిచ్చిన భరోసాతో సాంత్వన పొందుతున్నారు. పింఛను, ఇళ్లు ఇవ్వడం లేదని, ప్రజలు మొర పెట్టుకుంటుండగా నవరత్నాలను వివరిస్తూ వారికి భరోసా ఇస్తూ సాగుతున్నారు.

2400 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర..
జిల్లాలో తొమ్మిదో రోజైన గురువారం రాజోలు నియోజకవర్గంలో వరుసగా రెండో రోజు పాదయాత్ర సాగింది. బస ప్రాంతం రాజోలు శివారు శివకోడులో ఉదయం 8 గంటలకు తన కోసం వేచి ఉన్న ప్రజలను కలసిన జననేత జగన్‌ వారిచ్చిన వినతులు స్వీకరించారు.పలువురు అభిమానులతో సెల్ఫీలు దిగారు. అక్కడ నుంచి బయలుదేరారు. చింతలపల్లి క్రాస్‌ వద్ద 2400 కిలోమీటర్ల మైలురాయి దాటారు. ఈ సందర్భంగా చింతలపల్లి బ్రిడ్జి వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను జగన్‌ కట్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

పాదయాత్రలో పాల్గొన్న పార్టీ శ్రేణులు..
పాదయాత్రలో వైఎస్సార్‌ సీపీ నేతలు పలువురు పాల్గొన్నారు. ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులను త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, అనంత ఉదయ్‌భాస్కర్, పార్టీ నేతలు మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, మంతెన రవిరాజు, రాష్ట్ర కార్యదర్శి జంపన రామకృష్టంరాజు, రాష్ట్ర బీసీ విభాగం నేతలు దొంగ నాగసత్యనారాయణ, పాటి శివకుమార్, బొమ్మిడి వెంకటేష్, గుండిమేను శ్రీనివాసయాదవ్, లీగల్‌ సెల్‌ కార్యదర్శి మంగిన సింహాద్రి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారు కాశీ, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు గుబ్బల నారాయణరావు, అడబాల బ్రహ్మాజీ, జిల్లెల బిన్ని సుభాకర్, అమలాపురం పార్లమెంటరీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాశీ మునికుమారి తదితరులు పాల్గొన్నారు.   

దారిపొడవునా వినతులు
పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు వినతి పత్రాలు ఇస్తూ ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ టీచర్లను 2007లో వైఎస్సార్‌ క్రమబద్ధీకరించారని, ఆ తర్వాత చేరిన తాము రాష్ట్ర వ్యాప్తంగా 832 మంది ఉన్నామని, తమను క్రబద్ధీకరించాలని కాంట్రాక్టు టీచరు గుర్రం స్వప్న విన్నవించారు. వికలాంగుల కోటాలోని బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని చెల్లుబోయిన లక్ష్మణరావు వినతిపత్రం ఇచ్చారు. తన 12 ఏళ్ల బిడ్డ కొల్లు మధుకిరణ్‌ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని తల్లిదండ్రులు జననేత వద్ద వాపోయారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలని, నెల రోజుల మందులకు రూ.5 వేలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ బిడ్డ వైద్యం కోసం కృషి చేయాలని కోరారు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని తమదంటూ దేవాదాయ శాఖ అధికారులు ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారని తాటిపాకు చెందిన గెడ్డం పుష్పశాంతి వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అందరి విన్నపాలు, సమస్యలు విన్న వైఎస్‌ జగన్‌ పరిష్కారంపై భరోసా ఇస్తూ ముందుకు కదిలారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top