వైఎస్సార్‌తో ఏపీ ప్రగతిపథం జగనన్నతో సంక్షేమ రాజ్యం

YS Avinash Reddy YSRCP Meeting in Bangalore - Sakshi

టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అథోగతి

కడప మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి  

బెంగళూరులో ఘనంగా బద్వేలు వైఎస్సార్‌ ఆత్మీయ సమ్మేళనం  

సాక్షి, బెంగళూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని.. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వల్ల అభివృద్ధిలో వెనుకబడిందని కడప మాజీ పార్లమెంట్‌  సభ్యులు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. రాజన్న రాజ్యం రావాంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఆదివారం నగరంలోని కుందనహళ్లిలో వీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో బెంగళూరులో నివాసం ఉంటున్న వైఎస్సార్‌ కడప జిల్లా వాసులు జి.పెద్దిరెడ్డి, వెంకటరెడ్డి, జి.రమణారెడ్డి, టి.రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, అంబవరం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు నియోజకవర్గ ప్రజలతో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత పదేళ్లుగా ప్రజల మధ్యనే ఉంటున్నారని చెప్పారు. ప్రజల ప్రతి సమస్యను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గమనించారని.. ఆయన అధికారంలోకి రాగానే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారని భరోసా ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ధర్నాలు, దీక్షలు చేశారు. ఏడాది పాటు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 

తరలివచ్చిన నాయకులు  
వైఎస్సార్‌సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శన్‌శర్మ, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ భక్తవత్సలరెడ్డి, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ కలకడ, నాయకులు తిరుపతిరెడ్డి, కాంట్రాక్టర్‌ రమణారెడ్డి, తిరుపతిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగార్జునరెడ్డి, పోరుమామిళ్ల ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పి.శారదమ్మ, సుదర్శన్, వెంకటసుబ్బయ్య, సీహెచ్‌ రామకృష్ణారెడ్డి, ఎంపీపీలు ఎస్‌.రామకృష్ణారెడ్డి, చేజెర్ల సుబ్బారెడ్డి,మాజీ ఎంపీపీ ఎన్‌.విశ్వనాథ్‌రెడ్డి, బద్వేలు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.గురుమోహన్, సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ గురివిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, బూత్‌ కన్వీనర్‌ కె.రమణారెడ్డి, బద్వేల్‌ మండల కన్వీనర్‌ వై.యోగానందరెడ్డి, కడప పార్లమెంటరీ జాయింట్‌ సెక్రెటరీ కొండా దామోదర్‌రెడ్డి, నాయకులు చిత్తా గిరిప్రణీత్‌రెడ్డి,  రామ్మోహన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, బాలు, నాగమునిరెడి, రాజశేఖర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

జగన్‌తోనే రాష్ట్రానికి రక్ష
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కడప జిల్లా అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లాతో పోటీ పడేదని.. కాగా ప్రస్తుతం వెనుకబాటులో  విజయనగరం జిల్లాతో  పోటీ పడుతోందని  విధాన పరిషత్తు సభ్యుడు డీసీ గోవిందరెడ్డి అన్నారు. జిల్లాలో సాగునీటితో పాటు చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైందన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు.  

అబద్ధపు పాలనకు చరమగీతం
గత 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదని కడప మేయర్‌ సురేష్‌బాబు ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సాధ్యం కాని 600 అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను నిలువునా మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతారన్నారు.  
–  కడప మేయర్‌ సురేశ్‌బాబు

స్థానికంగా ఉపాధి కల్పిస్తాం
స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం బెంగళూరుకు వలస వచ్చిన బద్వేలు నియోజకవర్గ ప్రజలందరు స్వగ్రామాలకు తిరిగి రావాలని ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ స్థానికంగా ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.    – వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్య

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top