‘అవిశ్వాసంపై కేంద్రం కుంటిసాకులు’

YS Avinash Reddy Comments On No Confidence Motion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... లోక్‌సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం సరికాదని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి చేయొత్తి మద్దతు తెలిపేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్న తరుణంలో సభను వాయిదా వేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తూనే ఉంటామని చెప్పారు.

‘ఈరోజు అవిశాస తీర్మానం పెడితే మద్దతు తెలిపేందుకు 99 నుంచి వంద మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. ఆర్డర్‌లో లేదన్న సాకుతో సభను వాయిదా వేయడం దారుణం. ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పలేకే కేంద్రం కుంటిసాకులతో తప్పించుకోవాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీరును ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో మాట్లాడి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామ’ని వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top