పాదయాత్రలు విజయవంతం చేయండి

YS Avinash Reddy Ask To People Support To Padayatra On14th - Sakshi

పులివెందుల : ఈనెల 14వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ పాదయాత్రలు చేయాలని పిలుపునిచ్చిందన్నారు. గురువారం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 12, 13వ తేదీలలో పులివెందుల నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ సంఘీభావ పాదయాత్ర ఉంటుందని, 14, 15వ తేదీలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు ఉంటాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు దాటుతోందని, పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. తన అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదాపై మాట మార్చారన్నారు. చంద్రబాబు మోసాలతో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. పాదయాత్ర చేపట్టి ఇప్పటికి దాదాపు 2వేల కి.మీ పూర్తి కావస్తోందన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను సావధానంగా వింటూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఆ సమస్యలను తాను ఏవిధంగా తీర్చుతానో తెలియజేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో అధికారపార్టీ గుండెల్లో గుబులు పుట్టుకుందన్నారు. తన అవినీతి సొమ్ముతో ఎన్నికలను గట్టెక్కించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారన్నారు. చంద్రబాబు నీచ బుద్ధిని ప్రజలందరూ గమనించాలన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయనకు సంఘీభావంగా చేపట్టే పాదయాత్రను  అన్ని నియోజకవర్గాల శ్రేణులు, ప్రజలు  జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top