‘కాంగ్రెస్‌ మరో ఓటమికి సిద్ధం కావాలి’

Yogi Congratulates To Prime Minister Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అభినందనలు తెలిపారు.‘ విజయవంతంగా నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వర్గానికి అభినందనలు. మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా రూపాంతరం చెందుతుంది. కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికల్లో మరో ఓటమికి సిద్ధంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. కాగా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసి నేటితో నాలుగేళ్లు ముగిసిన సందర్భంగా ఎన్డీఏ పక్షాలు అభినందనలు తెలుపుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీ వైఫల్యాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top