బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటుపై చర్యలేవి?: జాజుల

Where is the actions on BC Sub-Plan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ ఏర్పాటుచేస్తేనే నిధుల వినియోగం క్రమ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు సీఎం హామీ ఇచ్చి ఏడు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.1,100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top