చంద్రబాబు.. ఫోబియాల నుంచి జర బయటపడండి!

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కూడా తమ పార్టీయే కారణమని సీఎం చంద్రబాబు చెబుతాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ట్విటర్‌ వేదికగా తమపార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెబ్తుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబే ప్యాకేజీ ముద్దు అన్నాడని, ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని హోదా కావాలంటున్నాడని మండిపడ్డారు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటేనన్నారు.
 
చంద్రబాబుకు కెసీఆర్ అన్నా మోదీ అన్నా వణుకని, తనలాగా ఇతరులకు చెమటలు పట్టడం లేదు కాబట్టి అంతా కలిసి పోయారని గుండెలు బాదుకుంటాడని తెలిపారు. జర ఫోబియాల నుంచి బయటపడండి చంద్రబాబు గారూ! అంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top