జగన్‌ను సీఎం చేయడమే ఏకైక లక్ష్యం

Vijaya Sai Reddy Meeting In Anantapur - Sakshi

పార్టీని బూత్‌ స్థాయిలో పటిష్టం చేయాలి

అంకిత భావంతో పని చేసే ప్రతి కార్యకర్తనూ గుర్తిస్తాం

రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపు

అనంతపురం: రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పని చేయాలని రాజ్యసభ సభ్యులు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఓ  హోటల్లో వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ హిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ,  వైఎస్సార్‌ సీపీని బూత్‌స్థాయిలో పటిష్టం చేసేందుకు పార్టీ అనుబంధ కమిటీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్‌బూత్‌కు పదిమంది సభ్యులతో పాటు ఒక కన్వీనర్‌ ఉండాలన్నారు. అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్తనూ పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వారికి ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనుబంధ సంఘాల నాయకులు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి పాటు పడాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంటు సీట్లతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరాలని...  ఇందుకోసం ప్రతి కార్యకర్తా చిత్తశుద్ధి, క్రమశిక్షణతో సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... రాబోయే వందరోజులు అత్యంత కీలకమైనవన్నారు. ఇన్ని రోజులు చేసిన పని ఒక ఎత్తయితే  ఈ వంద రోజులు అత్యంత కీలకమన్నారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. పార్టీ సూచనల మేరకే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనీ, తమకిచ్చిన పదవులకు న్యాయం చేయాలన్నారు. పదవులు తీసుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదన్నారు. కచ్చితంగా పని చేస్తామంటేనే పదవుల్లో ఉండాలని లేదంటే తప్పుకోవాలని సూచించారు.  సమన్వయకర్తలే గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.

అనంతరం శంకరనారాయణ మాట్లాడుతూ, అనుబంధ సంఘాల నాయకులు ఆయా కులాల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.  సమావేశంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తలు తలారి పీడీ రంగ య్య, నదీమ్‌అహమ్మద్, మాజీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, ఉషాశ్రీచరణ్, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరుశురాం, మహలక్ష్మీ శ్రీనివాస్, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి చందు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైవీ శివారెడ్డి, కెప్టెన్‌ షేక్షా, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బుర్రా సురేష్‌గౌడ్, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు బీసీ సెల్‌ పామిడి వీరా, రైతు విభాగం బోయ రాజారాం, ఎస్సీ సెల్‌ పెన్నోబులేసు, మహిళా విభాగం బోయ గిరిజమ్మ, పార్వతి, ట్రేడ్‌ యూనియన్‌ మరువపల్లి ఆది నారాయణరెడ్డి, సాంస్కృతిక విభాగం రిలాక్స్‌ నాగరాజు, లీగల్‌ సెల్‌ నారాయణరెడ్డి, ఎస్టీ సెల్‌ రామకృష్ణ, విద్యార్థి విభాగం ఎద్దుల రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top