ఓట్లు చీల్చేందుకు పవన్‌ కొత్త నాటకం

Vasireddy Padma Respond on Pawan Kalyan Comments - Sakshi

వైఎ‍స్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: ఓట్లు చీల్చడానికి పవన్‌ కళ్యాణ్‌ కొత్త నాటకానికి తెర తీశారని వైఎ‍స్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఎన్ని డ్రామాలు, పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు నమ్మరని అన్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం కాలేరు కాబట్టే సీఎం పదవి వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ కళ్యాణ్‌ తన తీరును తానే ప్రశ్నించుకోవాలని సూచించారు. అప్పుడప్పుడు ప్రశ్నిస్తే ఏం బాధ్యత ఉన్నట్టు అని అడిగారు. హఠాత్తుగా ప్రశ్నించడం మీ అతి తెలివి కాదా? ప్రత్యేకహోదాకు అడ్డుపడింది మీరు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. నాటకాలు కట్టిపెట్టాలని హితవు పలికారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..

  • మమ్మల్ని చూసి ఓటేయమని ఎన్నికల సమయంలో పవన్‌ ఊరూరు తిరిగారు
  • చంద్రబాబు ఇచ్చిన 600 ఎన్నికల హామీలకు మీరు బాధ్యులు కారా?
  • టీడీపీ మేనిఫెస్టోపై మీ బొమ్మ లేదా?
  • టీడీపీ-బీజేపీ పాలనలో మీకు బాధ్యత ఉంది
  • చంద్రబాబు ప్రభుత్వాన్ని కూర్చోబెట్టింది మీరు కాదా?
  • టీడీపీ ప్రభుత్వ పాలనతో తనకేం సంబంధం లేన్నట్టు పవన్‌ వ్యవహరిస్తున్నారు
  • ప్రశ్నించే స్థానంలో ఉన్నారా? సమాధానం ఇచ్చే స్థానంలో ఉన్నారా?
  • నాలుగేళ్లలో ఒక్కసారైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా?
  • రాష్ట్రానికి రావాల్సిన వాటికి అడ్డుపడింది మీరు కాదా?
  • టీడీపీ హామీల అమలుకు బాధ్యత నాది అన్నారు
  • ప్రభుత్వాన్ని నిలదీయకుండా ప్రతిపక్షానే నాలుగు మాటలన్నారు
  • నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అడ్డగోలుగా రూ.200 కోట్లు ఖర్చు చేసింది
  • పవన్‌ కళ్యాణ్‌ దీని గురించి అడగటం లేదు
  • అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందానికి ఎవరు జవాబు చెబుతారు?
  • ఒక్కొక్క సినిమాలో ఒక్కో క్యారెక్టర్‌ వేసినట్టు కాదు రాజకీయాల్లో మాట్లాడటమంటే
  • నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలకు మీకు కడుపు మండలేదా?
  • నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు, అపుడు కూడా మీకు కడుపు మండలేదు
  • ఏ మాత్రలు వేసుకుని నిద్రపోయారో పవన్‌ చెప్పాలి
  • మళ్లీ ఓట్లు చీల్చేందుకు తెరపైకి వచ్చారు
  • మరో కొత్త నాటకానికి పవన్‌ కళ్యాణ్‌ తెర తీశారు
  • మూడేళ్లలో చంద్రబాబు లక్షా 20 వేల కోట్లు అప్పు చేశారు
  • ఆ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు?
  • ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌లో ఎందుకు కలిపారు?
  • మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరు అన్యాయం చేశారు
  • రాష్ట్ర ప్రజలకు మీరెందుకు సేవ చేయలేదు
  • వైఎస్‌ జగన్‌ మీలాగా ప్యాకేజీలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగలేదు
  • ఎవరెన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యంలా జగన్‌ బయటకు వస్తారన్న నమ్మకం మాకుంది
  • ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పోరాడుతున్నారు
  • ఏ విలువలు పాటించాలి మిమ్మల్ని చూసి?
  • టీడీపీతో సంబంధం లేదని ఒక్కసారి కూడా పవన్‌ చెప్పలేదు
  • ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి
  • మీ ముసుగు తొలగించండి.. ఓట్లను చీల్చేందుకు డ్రామాలాడేందుకు మీరుండొద్దు
  • ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఇప్పటివరకు పవన్‌ ప్రశ్నించలేదు
  • 22 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు
  • ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల చొప్పున రూ.700 కోట్లు ఇచ్చారు
  • మరి ఇన్నాళ్లు మీరెందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు
  • చంద్రబాబుకు మద్దతు ఇచ్చి దోషిగా మీరు బోనులో నిలబడ్డారు
  • ప్రతి వేలు మీ వైపు, చంద్రబాబు వైపు సమానంగా చూపిస్తున్నాయి
  • చంద్రబాబు అరాచక పాలనకు మీరూ బాధ్యులే
  • ప్రశ్నలు వేసే హక్కును మీరు కోల్పోయారు
  • నాకు బాధ్యత లేదు.. నేను ప్రశ్నిస్తానంటే కుదరదు
  • ప్రశ్నలు మేము వేస్తాం.. మీరు సమాధానాలు చెప్పండి
  • ఎన్ని డ్రామాలు, పిల్లిమొగ్గలు వేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top