రాహులే భావి ప్రధాని: ఉత్తమ్‌ 

Uttamkumar Reddy comments about Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజనీకుమార్‌ యాదవ్, ఇతర కాంగ్రెస్‌ నేతలు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం గాంధీభవన్‌ ప్రాంగణంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ని భావి భారత ప్రధానిగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు. 

శుభాకాంక్షలు చెప్పేందుకే: మల్లు రవి 
పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క నేతృత్వంలో కొందరు కీలక నేతలు ఢిల్లీ వెళ్లడంపై భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందించారు. రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే భట్టి నేతృత్వంలో పలువురు నేతలు ఢిల్లీ వెళ్లినట్లు స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను తప్పించాలని ఎవరు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top