‘కార్మికులను కేసీఆర్‌ దగాచేసిండు’

Uttam kumar reddy fires on CM KCR in Singareni Election Campaign - Sakshi

సాక్షి, మంథని : పెద్దపల్లి జాల్లా మంథని నియోజకవర్గంలోని రామగుండం రీజియన్‌లో కాంగ్రెస్‌ సింగరేణి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎన్నికల ప్రాచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ..  తెలంగాన సాధించడంలో, కేసీఆర్‌ను గెలిపించడంలో సింగరేణి కార్మికులు పాత్ర కీలకమైందన్నారు.

అయితే, ఎన్నికల ముందు కేసీఆర్‌ 72 హీమీలు ఇచ్చినా మూడేళ్ల పాలనలో ఏ హీమీ నేరవేర్చకుండా కార్మికులను దగాచేసిండు అని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు, ఇన్‌కాం టాక్స్‌, డబుల్‌  బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల హీమీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఏనైటీయూసీ, ఐఎన్‌టీయూసీకి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

టీబీజీకేఎస్‌ను ఓడించి టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయంలు కూడా పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top